శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులైన రఘునాథ్ యాదవ్ సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్కు శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవ సమాజ అభివృద్ధికి, కార్పొరేషన్ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఈ సందర్బంగా రఘునాథ్ యాదవ్ తెలిపారు.






