శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 47 మంది లబ్ధిదారులకు రూ.47,05,452 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. కూకట్‌పల్లి మండల పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి (పార్ట్) డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఈ సహాయాన్ని వివేకానంద నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఒకే రోజు 47 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించడం సంతోషకరమని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా, పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






