శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బారీ బహిరంగ సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు అభినందనలు తెలియజేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.






