కులాలకు, ప్రాంతాలకు అతీతంగా హిందువులు ఏకమవ్వాలి: వీరధర్మజ స్వామి

శేరిలింగంప‌ల్లి, మే 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశంలో ప్రత్యేకంగా హిందూ సమ్మేళనాలు చేసుకోవాల్సిన పరిస్థితికి హిందువులు చేరుకోవడం బాధాకరమని వీరధర్మజ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గోపినగర్ లోని బీసీ హాస్టల్ ప్రాంగణంలో హిందూ మహా సమ్మేళనం వైభవంగా నిర్వ‌హించారు. గోపినగర్, బాపూనగర్, నెహ్రూనగర్, ప్రశాంత్ నగర్, ఆదర్శ్ నగర్, డోయన్స్ కాలనీ, సుదర్శన్ నగర్, భాగ్యలక్ష్మి నగర్, ఆలిండ్ సొసైటీ లకు చెందిన దాదాపు 3వేల మంది హిందువులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు కర్చర్ల ఎల్లేష్, మారబోయిన రవి యాదవ్, బిఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతకింది రవీందర్ గౌడ్, ఆస్ట్రేలియాలో ఎంపీగా పోటీ చేసిన ప్రముఖ బిల్డర్ నిఖిల్ రెడ్డి, సాయి జ్యోతి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణమూర్తి, ప్రచార రథం సమకూర్చిన దొంతి సత్యనారాయణ గౌడ్ లను హిందూ సమ్మేళనం కార్యచరణ కమిటీ ఘనంగా సత్కరించింది.

అనంతరం ముఖ్యఅతిథిగా హాజ‌రైన సిద్దిపేట జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపతి విశ్వబ్రహ్మ శ్రీ వీరధర్మజ స్వామి మాట్లాడుతూ కులాలకు, ప్రాంతాలకు అతీతంగా హిందువులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. కుల, ప్రాంత, వర్గ, వర్ణ రాజకీయాల కారణంగా హిందువుల్లో ఐక్యత దెబ్బతింటున్నదని అన్నారు. సమస్య తన వరకు వస్తే తప్ప హిందువుల్లో చైతన్యం రాని పరిస్థితిలు నెలకొన్నాయని అన్నారు. మనదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, హిందువుల కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ అంటూ లేదని, అన్ని పార్టీలు కూడా ప్రత్యేక వర్గాల కోసం మోర్చాలు నడిపిస్తున్నాయని చురకలంటించారు. లవ్ జిహాద్ నుండి హిందూ యువతులను రక్షించుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపైనే ఉందని సూచించారు. గోపినగర్ లోని గోవర్ధనగిరి పై శ్రీరాముని భవ్య మందిర నిర్మాణాన్ని చేపట్టాలని, తన వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళాలను సేకరిస్తానని బస్తీ వాసులకు అభయమిచ్చారు.

ముఖ్యవక్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధిపతి, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. హిందుత్వం ఉంటేనే దేశం నిలబడుతుందని అన్నారు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా అఖండ భారత దిశగా అడుగులు వేయాలని, ఓపికతో పోరాడితే ఏదైనా సాధ్యమని అన్నారు. మహిళా వక్త, సీనియర్ జర్నలిస్టు, సీత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు దేవికా రెడ్డి మాట్లాడుతూ.. పసిప్రాయం నుంచే పిల్లలకు సద్బుద్ధులు నేర్పాలని, ఆడపిల్లలకు హిందూ సాంప్రదాయం ప్రకారం కట్టు బొట్టు ఉండేట్టు చూడాలన్నారు. పుట్టినరోజు వేడుకల్లో కేక్ కటింగ్ సంప్రదాయాన్ని నిరోధించాలని సూచించారు. సమ్మేళనంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాట్య కుసుమ డాన్స్ అకాడమీ గురువు లక్కాకుల సుమలత శిష్య బృందం కూచిపూడి నృత్యంతో.. కేఎల్ఎన్ స్వామి బృందం భగవద్గీత పఠనంతో.. శివ బృందం హనుమాన్ చాలీసా పారాయణంతో సభికులను ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం కార్యాచరణ కమిటీ గౌరవాధ్యక్షుడు గోపీనాథన్ పిల్లై, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాట నరసింహ గౌడ్, బెజగం కేశవులు, సలహాదారులు పూజల ప్రభాకర్, చింతకింది గోవర్ధన్ గౌడ్, రమణీయమ్మ, రాజేశ్వరమ్మ, ప్రతినిధులు రవీందర్ రెడ్డి, రంగా గౌడ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావు, లచ్చమొళ్ల పాండు గౌడ్, గోపాల్ యాదవ్, పవన్ గౌడ్, ప్రభాకర్, జగదీష్, అశోక్, సత్యనారాయణ, నరసింహ, రాజు, నిర్మల్ కుమార్, సుధాకర్, జయశంకర్, పంచాక్షరి, మధుకర్, సుమన్, అంబ చారి, అనిల్, వివిధ పార్టీల నాయకులు, బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here