శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే కులాల వారీగా గణన అత్యవసరమని, దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరైన వారికి చేరే అవకాశం ఉంటుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. జనగణనలో కులాల వారీగా గణన నిర్వహించి, ముఖ్యంగా బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో శనివారం అంబర్ పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు జగదీశ్వర్ గౌడ్ సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా అంచనా వేయడానికి కులగణన అవసరమని ఆయన స్పష్టం చేశారు. బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, లేబర్ సెల్ నాయకులు, మైనారిటీలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





