శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు డాక్టర్ దాసరి రాజు అజయ్ కుమార్ రాష్ట్ర రజక సంఘం కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా గురువారం నియమాక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు. రజక సంఘం కుటుంబ సభ్యులు ఆర్థికంగా రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా వారి ఎదుగుదలకు తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.






