శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): సీఎంఆర్ఎఫ్ అనేది కేవలం ఒక నిధి కాదు, అది నిరాశలో ఉన్నవారికి ఆశ, బాధలో ఉన్నవారికి బలం అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల కుటుంబాలకు అందజేశారు. మొత్తం 9 మందికి రూ.6.10 లక్షల సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంతో ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరేలా కృషి చేస్తున్నారని అన్నారు, ముఖ్యమంత్రి సహాయ నిధి కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే ఒక గొప్ప ఆధారం అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సహాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏకే బాలరాజ్, రాములు గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, కావూరి ప్రసాద్, పట్వారీ శశిధర్, సంజు, మోహన్ రెడ్డి, చిన్నా, రాంచందర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, ముజీబ్, సుధాకర్, తిరుపతి, వెంకన్న, ప్రభాకర్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.






