శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి గ్రామ బొడ్రాయి స్థాపన మహోత్సవానికి బీఆర్‌ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జ్ మాధవరం కృష్ణారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, అనిల్ రెడ్డి, సురేష్ ముదిరాజ్, గ్రామ పెద్దలు కృష్ణ యాదవ్, శ్రీనివాస్, కె. రాములు, మల్లికార్జున్, యెల్లేష్, లింగంపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






