శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిమ్మల రామకృష్ణ గౌడ్ పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట సగర సంఘం అధ్యక్షుడు దిండి శ్రీనివాసులు సాగర్, ప్రధాన కార్యదర్శి బీసం చిన్నరాయుడు సాగర్, కోశాధికారి బీసం శేఖర్ సాగర్, గ్రేటర్ యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటి వినోద్ సగర, అధ్యక్షుడు గుంటి లక్ష్మీనారాయణ సగర, మోడల గోవర్ధన్ సగర, చిలక వెంకట రాములు సగర, ఆస్కానీ సాయిబాబా సగర, గుంటి రాములు సాగర, చిలక ఆంజనేయులు సగర, బీసం రంగయ్య సగర, కార్యవర్గ సభ్యులు మొగిలి శివసాగర్, చెంచేటి ఆంజనేయులు సగర, మొగిలి రాఘవేంద్ర సాగర్, చిలుక చంద్రశేఖర్ సాగర్, గుంటి విజయసాగర్, బిజినేపల్లి శ్రీనివాస్ సాగర్, చిలుక మారుతి సాగర్, కొండికంటి నరేష్ సాగర్, తుమ్మల రాజు, బీసం రాఘవేంద్ర సాగర, మోడల ప్రదీప్ సగర పాల్గొన్నారు.






