ఘనంగా జిఎల్ఎన్ రెడ్డి జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్ పల్లి నాయకుడు గజ్జెల లక్ష్మీనారాయణ రెడ్డి (జిఎల్ఎన్ రెడ్డి) జన్మదిన వేడుకల‌ను అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వ‌హించారు. జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రెడ్డి సంఘం నాయకులు, జిఎల్ అభిమానులతో కలిసి బండి మధుసూదన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్య ఉదయం తెలంగాణ ఎడిటర్ బాషా, స్థానిక విలేకరులు శ్యామ్ సుందర్, క్రాంతి కుమార్ లతో కలిసి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచితనానికి మారు పేరు అయిన జిఎల్ఎన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకల‌ను మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామ‌ని, రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, రానున్న రోజుల్లో ఆయ‌న‌కు తాము సైతం అంటూ అండగా నిలుస్తామని అన్నారు. ఈ వేడుకల్లో శివారెడ్డి, దీపక్ రెడ్డి, అఖిల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, కచ్చిన్ మహబూబ్, నాగభూషణ్ రెడ్డి, తులసి రెడ్డి, సాయినాథ్ రెడ్డి, గాల్ రెడ్డి, తిరుపతి, కోటేశ్వర్ రావు, ఆదిరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి, హరి, మూర్తి, హుస్సేన్, స్వరూప్, వేణు, శ్యామ్, శ్రీధర్, ప్రేమ్, అభినయ్, అభి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here