శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని హఫీజ్‌పేట్ డివిజన్‌లోని ప్రకాష్ నగర్ కాలనీలో సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలకు, కఠోర దీక్షకు నిదర్శనం భగీరథ మహర్షి అని, గంగను భువికి రప్పించిన ఆ మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






