శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఘ‌న నివాళులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర ఉప్పర సంఘం జగద్గిరిగుట్ట ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని భగీరథమహర్షికి పూలమాల సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సగర యువజన సంఘం నాయకులు శ్రీ భగీరథ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ అనేక సంవత్సరాలు ఒంటి కాలిపై తపస్సు చేసి, సమస్త జీవకోటికి ప్రాణాధారమైన గంగను దివి నుండి భువికి తీసుకు వచ్చిన రాజర్షి, సగర (ఉప్పర) కుల గురువు శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలలో పాల్గొనడం ఆనందంగా గర్వంగా ఉంద‌ని, సగర ఉప్పర సంఘానికి అన్నివేళలా తాను అందుబాటులో ఉంటాన‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, సగర సంఘం అధ్యక్షుడు వేముల సుదర్శన్ సాగర్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ భీమయ్య, కోశాధికారి వెంకటరమణ సాగర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.రాములు సాగర్, kp రాములు సార్, మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ సగర, ప్రధాన కార్యదర్శి జ్యోతి సగర, లావణ్య సగర, మంజుల సగర, శాంత సగర, నాయకులు సుమన్ సాగర, కిషోర్ సగర, చంద్రమోహన్ సగర, సలహాదారులు, కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here