శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. కనీవినీ ఎరుగని స్థాయిలో ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరిలలో విద్యార్ధులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన ఈ పరీక్షలో విద్యార్ధులు టాప్ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. జేఈఈ మెయిన్స్ లో పి. శ్రీ చరణ్ మొదటి ర్యాంకు సాధించాడు. డి. త్రిశల్ 42వ ర్యాంక్ సాధించగా, ఎన్. మైత్రేయి 45వ ర్యాంకు దక్కించుకుంది. ఎల్. దివిజ జ్యోతిర్మయికి 142వ ర్యాంకు వచ్చింది. ఎమ్. శ్రీధర్ కు 162వ ర్యాంకు, కె. ప్రణయ కుమార్ 178వ ర్యాంకు, జి. యువన్ చంద్ర కి 179వ ర్యాంకు, డి. ఇకాక్ 188వ ర్యాంకు, బి. సందీప్ కి 203వ ర్యాంకు, ఎల్. సాయి దీపక్ కు 225వ ర్యాంకులు వచ్చాయి. అలాగే 254, 263, 264, 276, 284, 290, 296తో పాటు ఎస్ ఆర్ విద్యాసంస్థల నుండి 313, 343, 347, 381, 395, 409, 437, 459, 470, 480, 490, 498వ ర్యాంకు వరకు సాధించారు. మొత్తం 3562 మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్ కు క్వాలిపై అయ్యారని యాజమాన్యం వెల్లడించింది.

ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్, డైరెక్టర్ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ లో తమ విద్యార్ధులు సాధించిన ఈ విజయం పట్ల తాము గర్వపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల కఠోరశ్రమ, అధ్యాపకుల అంకితభావం, వినూత్నబోధనా పద్ధతులే ఈ అఖండ విజయానికి పునాది అని కొనియాడారు. విద్యార్థులకు అకాడమిక్ తో పాటు వారిపై ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్ లో కూడా తమ విద్యార్థులు ఇదే ఉత్సాహాన్ని, ప్రతిభను కనబరుస్తారని ఆశిస్తున్నాం అని తెలిపారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను, సహకరించిన తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని కాలేజీ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.





