అంబేద్క‌ర్ చూపిన బాట‌లోనే ఉద్య‌మం చేయాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి గోపి నగర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోపీన‌గ‌ర్‌, బాపు న‌గ‌ర్‌, ప్ర‌శాంత్ న‌గ‌ర్‌, నెహ్రు న‌గ‌ర్ ల‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల‌లో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, విద్యా వైద్యం అన్ని రంగాల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలందరికీ న్యాయం జరిగే విధంగా పోరాటం చేయక తప్పదని అన్నారు. అంబేద్కర్ బాటలోనే ఉద్యమం చేసి అధికారం సాధించుకొని బహుజనులకు న్యాయం జ‌రిగేలా చూసుకుందామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అధ్యక్షుడు రమేష్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షులు సత్యం, పండు గౌడ్, మహమ్మద్ గౌస్, ఎండి ముక్రం, కాల‌నీవాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here