శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ హాల్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో స్మార్ట్ బోర్డు సాంకేతికతతో కూడిన ఆధునిక తరగతి గదులు అత్యవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి, మెరుగైన ఫలితాల సాధనలో కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. హాల్ నిర్మాణానికి ఉదారంగా విరాళాలు అందించిన విజేత సూపర్ మార్కెట్ చైర్మన్ మానుకొండ జగన్మోహన్ రావు, యు.వి. రమణ మూర్తి, కోడే లీలావతి, కోడే గోపాలరావు, రావిపాటి స్వప్న, వలిగే పవన్ కుమార్ లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలకు సహకారం అందించిన ఇతర దాతలను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు వంగల్లు రామచంద్రారెడ్డి, ట్రెజరర్ జి. నాగభూషణరావు, ఉపాధ్యక్షుడు కె. సుదీప్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎం. నరేంద్ర ప్రసాద్, సభ్యులు ధీరజ్ కుమార్, శ్రీపాల్ రెడ్డి, దుర్గా మహేశ్వరావు పాల్గొన్నారు. స్థానిక ప్రముఖులు మంజుల రఘునాథ రెడ్డి, నార్ని శ్రీనివాసరావు, కట్ల శేఖర్ రెడ్డి, కట్ల రఘుపతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





