శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): మేథావులు, విద్యావంతులు దేశ అభివృద్ధిలో, వికసిత్ భారత్ లక్ష్యంలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు పిలుపునిచ్చారు. శిల్పాహిల్స్ సీనియర్ సిటిజెన్ ఫోరం ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్ ఉదయ క్రిసెంట్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మేథావులు, విద్యావంతుల మద్దతు సంపూర్ణంగా ఉందని, రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రతి డివిజన్‌లో, ప్రతి బూత్‌లోనూ బీజేపీ రావాలన్నారు. అందరూ అందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అభివృద్ధి విషయంలో అందరూ కలసి ముందుకు రావాలని అన్నారు. విద్యావంతులు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి, సమాజంలో మార్పు కోసం సహకారం అందించాలని, 12 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 12వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 4వ స్థానంలో ఉందన్నారు. దేశం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు ఆలోచించి అందరికీ తెలియజేయాలని, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ రమేష్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్, సభ్యులు రమణా రావు, ఉదయ్, వంశీ, తరుణ్, చంద్ర శేఖర్, కృష్ణయ్య, సూర్య తేజ, పూర్ణ చంద్ర రావు, శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజిత్, ప్రొఫెషనల్ ఫోరం కన్వీనర్ బాల్దా అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, జితేందర్, ప్రధాన కార్యదర్శి శివ యాదవ్, నాయకులు శ్రీశైలం కురుమ, పవన్, రాజేశ్వర్ రెడ్డి, మహేందర్, బాలు నాయక్, యాదయ్య, ఆనంద్, కుర్మయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.






