యువత స్వయం ఉపాధి వైపుగా అడుగులు వేయాలి: మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలో సామ్రాట్ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీరెడ్డి చికెన్ షాప్ ను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపుగా అడుగులు వేసి అభివృద్ధి చెందేందుకు వ్యాపారం చక్కని ఎంపిక అన్నారు. నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారాన్ని వినియోగదారులకు అందించి మంచి పేరును గడించాలన్నారు. పరిశుభ్రత, నాణ్యత, సమయపాలన అనే మూడు ముఖ్య అంశాలను పాటిస్తే వ్యాపారం నిరంతర అభివృద్ధి చెందుతుందని అన్నారు. వినియోగదారుల విశ్వాసం సంపాదించడం ప్రతి వ్యాపారికి అత్యంత ముఖ్యమని చెప్పారు. ఇలాంటి చిన్న వ్యాపారాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, నరేందర్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, శ్యామ్ యాదవ్, శేఖర్, ప్రకాశ్ నాయక్, దుర్గా రామ్, శ్రీశైలం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here