శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): రా స్ట్రెంగ్త్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4, 5 తేదీల్లో మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ లో రెట్రో డ్రైవిన్ సమీపంలో నిర్వహించిన రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్ కార్యక్రమంలో విరాటపర్వం దర్శకుడు ఉదగుల వేణు, సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నగరంలోని ఫిట్‌నెస్, కాలిస్థెనిక్స్ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని, హైదరాబాద్‌లోనే అతిపెద్ద కాలిస్థెనిక్స్ పోటీగా పేరుగాంచిన ఈ ఈవెంట్ అథ్లెట్లు, ఫిట్‌నెస్ ప్రేమికులు, ప్రేక్షకులను రెండు రోజులపాటు ఉత్సాహంతో ముంచెత్తిందని అన్నారు. నిత్య జీవితంలో శారీరక శ్రమతోపాటు వ్యాయమం ఎంతగానో ఉపయోగపడుతుందని, కొత్తదనంతో యువత ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పోటీలను అనిరుధ్, రోహిత్ నిఖిల్, అమన్, సత్య షెర్నీ, మెస్సీ, ఫిట్‌స్పిరిట్, కిర్‌స్టెన్ వరేలా, పార్థ్ వంటి నిపుణుల జడ్జింగ్ ప్యానెల్ సమీక్షించింది. వారు తమ అనుభవంతో పోటీకి నాణ్యతను తీసుకువచ్చారు.






