ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. ప్రత్యేక పూజలు, అన్నదానంలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ దేవి శరన్నవరాత్రి-దసరా ఉత్సవాల్లో భాగంగా మియాపూర్‌లోని హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీ, చందానగర్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మియాపూర్-మక్తా మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు కమిటీ సభ్యులు రాకేష్, నవీన్ ఆహ్వానం మేరకు ఉదయ్ కిరణ్ హాజరయ్యారు. జగన్మాత శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా చందానగర్‌లో కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి-దసరా ఉత్సవాలకు హాజరైన ఉదయ్ కిరణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, హారతి సమర్పించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతోపాటు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు మానవత్వం, సోదరభావం, దాతృత్వానికి ప్రతీకలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవాభావం, పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతాయని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో వీరేంద్ర గౌడ్, రవీందర్ రెడ్డి, రాంచందర్ గౌడ్, రవికుమార్, మధు, నర్సింగ్, శరత్, కామినేని వాసు, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, సతీష్, శశి తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ పెద్దలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మాత శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని యలమంచి ఉదయ్ కిరణ్ ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here