శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారు ప్రత్యేక పూజలందుకుంటున్నారు. రోజుకో అవతారంలో కనిపిస్తూ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మియాపూర్ న్యూ కాలనీలో శ్రీ విజయ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని శనివారం శ్రీమహాలక్ష్మీ దేవి అవతారంలో అలంకరించారు. అమ్మవారికి రూ.12,345,67 విలువైన కరెన్సీ నోట్లను అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.







