హఫీజ్ పేట్ డివిజన్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ BLY హోమ్స్ వద్ద బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణతోపాటు ప్రజలకు సేవగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ హాజ‌రై జెండా ఆవిష్కరణ, హఫీజ్ పేట్ చెరువు వద్ద, మాధవ్ నగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ అని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగులు గౌడ్, జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, మనోహర్, శ్రీశైలం కురుమ, డివిజన్ అధ్యక్షుడు జితేందర్, సీనియర్ నాయకులు రవి గౌడ్, వరప్రసాద్, శ్రీధర్ రావు, శ్రీనివాస్ యాదవ్, పవన్, సలీం, పద్మ, జగన్ గౌడ్, మనోజ్ యాదవ్, విజేందర్, సుబ్బారావు, కుమార్, రమేష్, రామారావు, నరసింహ, శివ, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here