శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ-బ్లాక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన గుడ్ లైఫ్ పాలిక్లినిక్ ను కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా గుడ్ లైఫ్ పాలిక్లినిక్ వైద్యులు డా. ఎం. ప్రశాంత్, డా. కే. కార్తీక్ లకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలలో నివసించే పేద ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం చాలా ఆనందకరమైన విషయమని తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాల వారు పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇలాంటి పాలిక్లినిక్‌లు వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగరాజు, సయ్యద్ ఉస్మాన్, షేక్ ఇమామ్, షేక్ జలీల్, సయ్యద్ ఘని, మంగలి కృష్ణ, సంజు, సయ్యద్ అమీనుద్దీన్, నదీమ్, సంతోష్, విజయ్ కుమార్, అబ్దుల్ రజాక్, హనుమంతు రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






