స‌మాజం ప‌ట్ల మీడియా బాధ్య‌తగా ఉండాలి: మాజీ మంత్రి హ‌రీష్ రావు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స‌మాజం ప‌ట్ల మీడియా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. నూత‌నంగా ఏర్పాటు చేసిన కేఎస్‌5 మీడియాను ఆయ‌న ఆదివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూప‌డంలో మీడియా చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ప్ర‌స్తుత స‌మాజంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయ‌డంలో మీడియా పాత్ర ఎంతో ఉంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేఎస్‌5 మీడియా చైర్మ‌న్ డి.కాశీనాథ్, ఉద్యోగులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here