శేరిలింగంపల్లి, ఏప్రిల్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భగ్నగా శుక్రవారం ఒడిస్సి, కథక్ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ధారోహర్ డాన్స్ అకాడమీ నీలాంజన చౌదరి ఆధ్వర్యంలో ఒడిస్సి నృత్య ప్రదర్శనలో శాంతాకారం, నమామి, దళి, స్థాయీ, జనసమోహిని పల్లవి ప్రదర్శనలను తనుశ్రీ, రియా నూతన, పావని, దేబశ్రీ ప్రదర్శించి మెప్పించారు. కథక్ నృత్య ప్రదర్శనలో గురువందనా, అభినయ, తరణ అంశాలను కళాకారులు నీతి, నవ్య, సన, డెబ్రాని, రుద్రాణి, ఖుష్బూ, ఇందిరా, పూజిత ప్రదర్శించి మెప్పించారు. గురువు సంజయ్ కుమార్ జోషి, ప్రీతి మహాపాత్ర, శ్రావ్య మానస ముఖ్య అతిధులుగా హాజరై కళాకారులను అభినందించారు.






