శేరిలింగంపల్లి, ఏప్రిల్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ బాలాజీ నగర్ బస్తీ పరిధిలోని మియాపూర్ విలేజ్, ప్రగతి ఎన్క్లేవ్, అరబిందో కాలనీ, దత్త సాయి ప్రాంతాల ప్రజలు సంయుక్తంగా ఏప్రిల్ 19వ తేదీన ప్రగతి ఎన్క్లేవ్ పార్క్లో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందకు స్థానిక నాయకులతో ఓ తాత్కాలిక కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా ఎ. రామప్రభు, మోహన్ ముదిరాజ్, యలమంచి ఉదయ్ కిరణ్, సమ్మెట ప్రసాద్, భాస్కర్ గౌడ్, రాచమల్ల సతీష్ గౌడ్, గౌడీ శ్రీశైలం ముదిరాజ్, పల్లె మురళి, నడిమిటి కృష్ణ, కేశవ రావు , లోకేష్, రవి కృష్ణ, దుర్గ మోహన్, మన్నే నరేందర్ ముదిరాజ్, అమర్ చంద్, బండారి రాఘవేంద్ర, రాజశేఖర్, స్వామి, షెల్లా అశోక్ కుమార్, రెడ్డి, సుబ్బారావు, తాండ్ర రామచందర్ గౌడ్, రాచమల్ల సతీష్ గౌడ్, అమ్మర్, పరమేశ్వర్, గోల్కొండ వెంకటేష్ లు నియామకమయ్యారు. హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ప్రముఖ స్వామిజీలు, ప్రముఖ వక్తలచే ఆధ్యాత్మిక ప్రసంగాలను ఏర్పాటే చేయనున్నారు. హనుమాన్ చాలీసా సామూహిక పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.






