శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ X రోడ్డు వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, గౌడ వర్గీయులతో కలిసి PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అసమానం అని అన్నారు. మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి , బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నామని , ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పుట్ట వినయ్ కుమార్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి లీలానంద గౌడ్, కోశాధికారి నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, గౌడ సంఘం ప్రముఖులు పి అశోక్ గౌడ్, యాదగిరి గౌడ్, కరుణాకర్ గౌడ్, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, నిమ్మల ఆనంద్ గౌడ్, మూల అనిల్ గౌడ్, ఏకాంత్ గౌడ్, లింగం గౌడ్, మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, వీరేందర్ గౌడ్, పవన్ గౌడ్, సాయికుమార్ గౌడ్, జగన్ గౌడ్, గణేష్ గౌడ్, రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , నాగరాజు, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






