ఉత్సాహంగా సురభి కళాక్షేత్రం థియేటర్ ఫెస్టివల్ – ఆకట్టుకున్న నాటిక ప్ర‌ద‌ర్శ‌న‌లు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సురభి కళాక్షేత్రం నిర్వహణలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ , తెలంగాణ‌ చలనచిత్రం, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ సహకారంతో థియేటర్ ఫెస్టివల్ 2026 ను నిర్వ‌హించారు. ఇందులో భాగంగా నెల్లుట్ల రమాదేవి రచించిన మీడియా మేనియా, తనికెళ్ల భరణి రచించిన గోగ్రహణం నాటికల‌ను ప్రదర్శించారు. ఈ రెండు నాటికలకు డా. రమేష్ సింథే దర్శకత్వం వహించగా సురభికి చెందిన దాదాపు 20 మంది యువత ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ తాను రాసిన కథకు డా.సురభి రమేష్ సరికొత్త హంగులు దిద్ది నాటకంగా వేయడం చాలా సంతోషాన్నిచ్చింద‌న్నారు. ఈ ఈ కార్య‌క్ర‌మంలో అహోబిలం మిల్లెట్ కేఫ్ ఫౌండర్ హేమ మాలిని, ఆకాశవాణి హైదరాబాద్ ఏడీపీ నిహారా కానేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here