శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ షిర్డీ సాయినాథ, మార్ఖండేయ స్వామి, సంతాన నాగదేవత అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన మండల పూజ, లక్ష్మీ గణపతి నవగ్రహ స్థాపిత దేవతా మూల మంత్ర హోమాలు, ప్రధాన కలశ స్థాపన పూజ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాగం అనిరుధ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ తమ కుటుంబాలతో సుఖశాంతులతో జీవించాలని ఈ సందర్భంగా ఆ దేవుళ్లను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్లు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






