శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రముఖ సామాజిక సేవకుడు మిరియాల రాఘవరావు జన్మదిన వేడుకలను చందానగర్‌లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, భోజన కార్యక్రమంలో పాల్గొని, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ మిరియాల రాఘవరావు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ, కుల మతాలకు అతీతంగా సేవలందిస్తూ, అందరి మనసులను గెలుచుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో సేవా భావంతో ముందుండే ఆయనకు మరెన్నో జన్మదినాలు ఆనందంగా జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మిరియాల ప్రీతం, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, సోన్దాస్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ సర్పంచుల అధ్యక్షుడు రామ్మోహన్, రఘునందన్ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మహిళా సంఘాల నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.





