ప్ర‌తి ఒక్క‌రు నీటిని పొదుపుగా వాడుకోవాలి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 22 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషినగర్ కాలనీలో పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వరల్డ్ వాటర్ డే సందర్భంగా వాటర్ ఎయిడ్ సంస్థ సహకారంతో కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ వాటర్ విస్తృత స్థాయి ర్యాలీలో మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. నీరు జీవం – నీటిని కాపాడుకుందాం, సేవ్ వాటర్ సేవ్ ఫ్యూచర్, వంటి నినాదాలతో కాలనీ వీధులలో ర్యాలీ నిర్వహించడం జరిగింద‌ని, పెరుగుతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వినియోగించడం అత్యవసరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ ఎయిడ్ సంస్థ ప్రదినిధులు, సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్, సుప్రజ, భగత్ ముదిరాజ్, గిరి, కృష్ణ, జ్యోతి, కాలనీ వాసులు వంశీకృష్ణ రెడ్డి, పాపిరెడ్డి, కమలాకర్ రెడ్డి, లక్ష్మీ కాంత్ రెడ్డి, శ్రీనివాస్, సింగరావు, అజయ్ కుమార్, రాంభూపాల్ రెడ్డి, రాజు, జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్, మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here