తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మ‌న్‌గా మూడోసారి కుంచ సునీల్ గౌడ్ ఎన్నిక

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో మూడోసారి ఘనవిజయం సాధించిన వైస్ చైర్మన్ కుంచ సునీల్ గౌడ్ కి హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు. మొదటిసారి 2011లో బార్ కౌన్సిల్ మెంబర్‌గా గెలిచిన సునీల్ గౌడ్ న్యాయ వ్యవస్థలో ఎన్నో సేవలు అందించారు. దానికి నిదర్శనంగా 2018లో మళ్లీ ఎన్నిక కాగా సునీల్ గౌడ్ ని బార్ కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి వైస్ చైర్మన్‌గా నియమించారు. అంతేకాకుండా గత సంవత్సరం ఆయనను హైకోర్టు క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఇప్పుడు మళ్లీ 2026 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన సునీల్ గౌడ్ పట్ల యావత్ తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే నిత్యం న్యాయవాదుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న సునీల్ గౌడ్ ని బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నుకోవాలని తెలంగాణ న్యాయవాద సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సునీల్ గౌడ్ మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించిన యావత్ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌ని అన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here