శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్లో ఉన్న శ్రీధర్మపురి క్షేత్రంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సిరిమువ్వ నాట్య నికేతన్ అకాడమీకి చెందిన కళాకారులు పలు నృత్య రీతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.






