శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రంలో భారతీయం సత్యవాణి ఆధ్వర్యంలో ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అవధాని రేమెళ్ల, ప్రముఖ బుర్ర కథా రచయిత ప్రదర్శకుడు బాబూజీలను సత్యవాణి ఘనంగా సన్మానించారు. ఉగాదికి వీరిని సన్మానించడం సంతోషంగా ఉందని, సంప్రదాయాలను గౌరవించడంలో శ్రీ ధర్మపురి క్షేత్రం ఎల్లప్పుడూ ముందుంటుందని సత్యవాణి అన్నారు.






