శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని జీహెచ్ఎంసీ మియాపూర్ సర్కిల్ 48 కార్యాలయంలో పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఎస్ఎఫ్ఏలు, శానిటేషన్ వార్డు ఇన్‌చార్జిలు, శానిటరీ సూపర్‌వైజర్‌లు, రాంకీ సిబ్బంది పాల్గొన్నారు. చెత్త నిర్వహణ, వారాంతపు మార్కెట్ల సమన్వయం, చెత్త సేకరణ, కుటుంబాల మ్యాపింగ్ అంశాలపై ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో డీసీ సమీక్షించారు.






