శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ కిందికుంట పార్క్‌లో తెలుగు భాషా ఉగాది వేడుకలను మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస రావు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస రావుకి ఘనంగా సన్మానం నిర్వహించారు. డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని, ప్రజలకు అందించిన సేవలను గుర్తించి, స్థానిక నివాసితులు, నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రతినిధులు, తెలుగు భాషా అభిమానులు పాల్గొన్నారు.






