సిటిజన్స్ కాలనీ వేముకుంట బస్తీలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కట్ల చంద్రశేఖర్ రెడ్డి

శేరిలింగంపల్లి, మార్చి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని సిటిజన్స్ కాలనీ వేముకుంట బస్తీలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులతో కూడిన రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ ప్రార్థనలు చేసే ముస్లింలకు ఈ తోఫా కిట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కట్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనం, పరస్పర ప్రేమకు ప్రతీక అని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజల సేవలో ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, హయాజ్ అహ్మద్ ఖాన్ , హరి, నర్సింగ్, చంద్రమౌళి, కార్యకర్తలు, యువ నాయకులు, ముస్లింలు, సిటిజన్స్ కాలనీ, వేముకుంట బస్తీ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here