ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్..

శేరిలింగంపల్లి, మార్చి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతీ స్వామి ఆశీస్సులతో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన శ్రీ షిర్డీ సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత అమ్మవారి ఆలయం అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్ధం నూతనంగా ఏర్పాటు చేసిన నీటి బోర్ ను ప్రత్యేక పూజలు నిర్వహించి రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వేద పండితుడు రాఘవేంద్ర శర్మ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని వినిపించారు.

ఈ సందర్బంగా పలువురు రాగం నాగేదంర్ యాద‌వ్‌కి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది పంటలు బాగా పండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు కృష్ణ రెడ్డి, బస్వయ్య, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, హరి, సారయ్య గౌడ్, సుధాకర్, నవీన్ రెడ్డి, అప్పారావు, సురేష్ రాథోడ్, నరసింహారావు, మహిళలు కళ్యాణి, సరిత, స్థానికవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here