శేరిలింగంపల్లి, మార్చి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ జమా మసీదు హజ్రత్ సైద్నా బిలాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చిన రంజాన్ తోఫాను స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటిలో ఆనందం నిండాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జహంగీర్, మైనారిటీ చైర్మన్ అజీమ్, నాయకులు శామ్యూల్ కార్తీక్, అలీ, రాజు, కార్తీక్ గౌడ్, జావేద్, కుమార్, మహిళా నాయకులు జయ, వార్డ్ సభ్యురాలు శశికళ తదితరులు పాల్గొన్నారు.






