శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలో ఉన్న పార్కులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జిహెచ్ఎంసి అధికారులు, కాలనీ వాసులతో కలసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలోని పార్కును స్థానికులు, వృద్ధులు, పిల్లలు వినియోగించుకునేలా సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అభివృధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. పార్కులో వాకింగ్ ట్రాక్, బెంచీలు, లైటింగ్ సదుపాయాలు, గ్రీనరీ, పిల్లల ఆటపరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని అన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీకాంత్ ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అట్టేపల్లి రామ ప్రభు, కాలనీ వాసులు KLN స్వామి, హనుమయ్య చౌదరి, రాజేంద్ర ప్రసాద్, నరసింహా రెడ్డి, వీరాంజనేయులు, నరసింహా రావు నాయుడు, ప్రతాప్ రెడ్డి, జిహెచ్ఎంసి యూబిడి అధికారి కుర్మయ్య , వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.






