శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో ఉన్న మసీదు వద్ద జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైందని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని, రంజాన్ మాసం ఉపవాసంతో మంచి తనం, సంస్కారం అలవడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్య నగర్లో ఇఫ్తార్ విందు..
రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో ఉన్న సెయింట్ ఐసాక్ పాఠశాలలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , సెయింట్ ఐసాక్ స్కూల్ చైర్మన్ వి.ఐసాక్ లాజరస్, ప్రిన్సిపాల్ ఖమర్ జహాన్ ఐసాక్, సాంబశివరావు, ఖాసీం, లియాకత్, అంకారావు, కాజా, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






