శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ డివిజన్ పరిధిలోని సాయి జ్యోతి నగర్ కాలనీ, స్టాలిన్ నగర్ కాలనీలలో ఉన్న మసీదులలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైందని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్, మార్రపు గంగాధర్ రావు, వినయ్ ముదిరాజ్, యాసిన్, హాసీఫ్, ప్రతాప్ రెడ్డి, మెయిన్, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






