శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్ లో సీనియర్ నాయకుడు అక్తర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు పండుగ రోజున వెలితి లేకుండా, వారికి ఎటువంటి లోటులేకుండా పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని అన్నారు. రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు, ఈద్గాలకు అభివృద్ధి మరమ్మత్తులకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






