శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో డీసీ శశిరేఖ సమావేశం నిర్వహించారు. ఇందులో ఏఎంసీలు, టీఐల, బీసీలు పాల్గొన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో మెరుగుదల కనబరచాలని, వ్యాపార లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని డీసీ సూచించారు. సర్కిల్ పరిధిలో పెండింగ్లో ఉన్న మీ సేవ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, విద్యుత్ శాఖలో జీఐఎస్ మార్పులకు చెందిన వివరాలను పునఃసమీక్షించాలని అన్నారు.






