రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం విద్యా రంగానికి కేటాయించాలి: ఏబీవీపీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలో విద్యార్థుల‌కు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయెంబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించాల‌ని ఏబీవీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్‌ప‌ల్లి విభాగ్ చందానగర్ నగర్‌ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ శాఖ నగర కార్యదర్శి ఎల్ తరుణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎటు చూసినా అన్యాయమే జరుగుతుంద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రూ.9వేల కోట్ల ఫీజు రీయెంబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఈ విష‌యంపై ఉలుకు ప‌లుకు లేద‌ని అన్నారు. రానున్న రోజుల్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి తప్పకుండా 15% ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం 15% ఇవ్వడమే కాకుండా విద్యా రంగానికి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా విద్య రంగానికే వినియోగించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here