శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ డివిజన్‌లో ఉన్న జలమండలి కార్యాలయంలో డివిజన్ల పరిధిలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై జలమండలి DGM నారాయణ, మేనేజర్ విజయ్ కాంత్ లతో కలసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలపై అధికారులు నిర్లిప్తతను వీడాలని అన్నారు. అధికారుల దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇంజనీరింగ్ విభాగం, జలమండలి విభాగం అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, రోడ్డు కట్టింగ్ సమయంలో మంచి నీటి పైప్ లైన్ , డ్రైనేజి పైప్ లైన్ వేసేటప్పుడు తవ్విన రోడ్ల ను వెంటనే మరమత్తులు చేయాలని, UGD, రోడ్లు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని , మంచి నీటి సరఫరా వ్యవస్థ ను సరిగ్గా నిర్వహించాలని, డ్రైనేజీ పొంగిపొర్లుతున్న కాలనీలలో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, డ్రైనేజి పొంగి పొర్లకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. సమస్య పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అభివృద్ధి పనులలో వేగం పెంచాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






