శేరిలింగంపల్లి, మార్చి 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోట్ల రాంగ్ సైడ్ డ్రైవింగ్‌ను నిరోధించేందుకు చర్యలు చేపట్టినట్లు సీఐ ప్రశాంత్ తెలిపారు. మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద కేపీహెచ్‌బీ వైపు, ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద చందానగర్ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు క్రాస్ బారియర్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని అన్నారు.






