శేరిలింగంపల్లి, మార్చి 7 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. శాయశ్రీ పాటిల్ భరతనాట్య ప్రదర్శనలో శాంకరి శాంగురు, కాలాయి తుకి, కల్యాణ రామ, భాగ్యదా లక్ష్మి అంశాలను ప్రదర్శించి మెప్పించారు. స్వరాంజలి డాన్స్ అకాడమీ నాట్య గురువు వర్ష రెడ్డి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో ముదకరత మోదకం, నటేశ కౌతం, భో శంభో, కాళీ కౌతం, అష్టలక్ష్మి , అయిగిరినందిని , దశావతరం, తక్కువేమి మనకు మొదలైన అంశాలను కళాకారులు రమ్య, నికిత, శ్రీకరీ, వర్ణిత, శ్రీనిక, సంజన, సింధూజ, శ్రీనిధి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.






