కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించాలి: భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్ పాల్గొన్న సమావేశంలో నేషనల్ కోఆర్డినేటర్ కమిటీ కన్వీనర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓబిసి సెంట్రల్ కమిటీ తెలంగాణణ అన్ని జిల్లాల రాష్ట్ర పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అన్ని కులాల సంఘాల ఓబిసీ మీటింగ్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్యా వైద్యం విషయంలో ఓబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. ఓబీసీలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ, సామాజిక, సంక్షేమ, అన్ని ఆర్థిక రంగాలలోనూ ఓబిసి ప్రజానీకానికి న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే సాయన్న ముదిరాజ్, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ యాదవ్, కన్వీనర్ కిరణ్ కుమార్, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కన్వీనర్ శివ ముదిరాజ్ యాదవ్, విజన్ కిరణ్ యాదవ్, నక్క మహేష్ యాదవ్, స్టేట్ యాదవ సంఘం యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here