శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేము కుంట కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, అక్బర్ ఖాన్, యూసఫ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






