సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ధార్మిక కార్యక్రమాలు కీలకం: బోయిని మహేష్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ శ్రీ షిర్డీ సాయి బాబా దేవాలయం 26వ వార్షికోత్సవం సందర్భంగా పూజ కార్యక్రమాల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజ‌లు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బోయిని మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మికత పెంపొందించడంలో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు కీలకమని అన్నారు. వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, మహా మంగళహారతి, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ గౌడ్, బాబు రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నవీన్, మనోజ్ యాదవ్, దేవేందర్ దాస్, హరి , రామారావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here